జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మండల పరిధిలోని నల్లబండగూడెం వద్ద గల అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్పోస్ట్ వద్ద వాహనదారులకు డ్రైవర్లకు వినూత్న పద్ధతిలో నియమాలను పాటించాలంటూ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి సురేష్ రెడ్డి పాల్గొని కారు డ్రైవర్లు తప్పనిసరిగా సీటు బెల్టును ధరించాలని కోరుతూ, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని కోరుతూ వారికి పువ్వులను అందజేయడం జరిగింది భద్రతా నిబంధనలు పాటించడం వల్ల ప్రమాదాలను తగ్గించుకోవచ్చని ఆయన సూచించారు ఒక వ్యక్తి లేదా వ్యక్తులు వాహనాలు నడిపే సమయంలో చేసే తప్పిదాలు కొన్ని కుటుంబాలను బలిగొంటాయని, అందుకోసం వాహనాన్ని నడిపేవారు అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలన్నారు. అదేవిధంగా వాహనాలను వినియోగించే క్రమంలో సంబంధిత ధ్రువపత్రాలను వాహన యజమానులు లేదా డ్రైవర్లు తమ వెంటనే అందుబాటులో ఉంచుకోవాలన్నారు ఇన్సూరెన్స్లను పొల్యూషన్ ధ్రువ పత్రాలను ఎప్పటికప్పుడు రెన్యూవల్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్. రాజ మహమ్మద్, కే.శ్రీనివాస్ అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ సాయి ప్రసాద్, మరియు కానిస్టేబుల్స్ చిన్ని బాబు, దేవేందర్, జానకిరామ్, మరియు ఇతర సిబ్బంది నాగరాజు, రాజకుమార్, సైబుద్ధిన్ తదితరులు పాల్గొన్నారు….
previous post
next post