Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఉపాధ్యాయ, విద్యారంగా, సామాజిక సమస్యలపై పోరాటమే ఎజెండా

ఎమ్మెల్సీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎన్నికల యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి…….

 ఉపాధ్యాయ విద్యారంగా సామాజిక సమస్యలపై శాసనమండలిలో నిరంతరం పోరాటమే తన ఎజెండా అని ఖమ్మం,వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ ఎన్నికల యుటిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కోదాడ పట్టణంలోని యుటిఎఫ్ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీగా తన పోరాటంతోనే ఉపాధ్యాయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. ఉపాధ్యాయ ఉద్యమాలు బలంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. మరొకసారి తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే శాసనమండలిలో ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానన్నారు. విద్య వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలని కేంద్ర బడ్జెట్ లో విద్యకు 10 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాట్లకు 500 కోట్లు గ్రాంట్ గా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలన్నారు .మధ్యాహ్న భోజన కార్మికుల రేట్లు పెంచాలన్నారు. దీర్ఘకాలికంగా ఈ కుబేర్ లో పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే ప్రభుత్వం చెల్లించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. తనకు ఉపాధ్యాయులు అంతా మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ పౌర స్పందన వేదిక జిల్లా అధ్యక్షులు ఆర్ ధన మూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కే మంగ, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, కే జ్యోతి, పాండురంగ చారి తదితరులు పాల్గొన్నారు………..

Related posts

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత  గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి 

TNR NEWS

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి.  ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి

TNR NEWS

యువతిలకు వివాహానికి పుస్తె చీర అందజేత

TNR NEWS

గాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 9 వ వార్డు పరిశీలన

TNR NEWS

ఉన్నతమైన భవిష్యత్తుకు విద్య పునాది…

TNR NEWS

నాగర్ కర్నూలు జిల్లా…. వాటర్ ఫాల్స్ కనువిందు

TNR NEWS