సిద్దిపేట జిల్లా గజ్వేల్ జిఎంఆర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ వంటేరు
గోపాల్ రెడ్డి ఎంపీహెచ్ఎస్ బంగ్లా వెంకటపూర్, గజ్వెల్ పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థిని,విద్యార్థులకు ఇంగ్లీష్ సంబంధించి మెలకువలను, పరీక్ష విధానము, గ్రామర్ తదితర విషయాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల బృందము, ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ బంగ్లా వెంకటాపూర్ పాఠశాలకు ఇంగ్లీష్, హిందీ పోస్ట్ లు మంజూరు చేయాలని ప్రభుత్వం ను కోరారు. ఈ పాఠశాలకు మళ్లీ అప్పుడప్పుడు వచ్చి క్లాసులు తీసుకుంటానని విద్యార్థులకు తెలిపారు. పాఠశాల తరఫున గోపాల్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.