తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. దీంతో ఈ గ్రూప్ 3 రాత పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
1365 పోస్టుల కోసం ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆదివారం అలాగే సోమవారం…ఈ రెండు రోజుల్లో ఈ పరీక్షలను నిర్వహించబోతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1 పరీక్ష నిర్వహించబోతున్నారు.
ఇక మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు పేపర్ 2 నిర్వహించనున్నారు అధికారులు. 18వ తేదీ అంటే రేపు ఉదయం…ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మూడవ పేపర్ నిర్వహించబోతున్నారు. ఈ 1365 పోస్టులకు గాను 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నమాట. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి…అనుమతి ఇవ్వబోమని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. పరీక్ష కేంద్రానికి 30 నిమిషాల ముందే చేరుకోవాలని సూచించారు. ఒకే హాల్ టికెట్ 3 పేపర్లకు వర్తించనుంది.