దేశ్పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశ్వనాథ్పల్లి గ్రామంలో సోమవారం ఫిల్డ్ డేస్ మీటింగ్ ను నిర్వహించి రైతులకు, కో ఫార్మర్స్ కి పంట అవశేషాలు వాటి నిర్వహణ, బయోచర్ తయారీ దాని ప్రయోజనాలు, వర్మిబెడ్ తయారీ, కంపోస్టింగ్, హెచ్డీపిఎస్, బొటానికల్స్ యెక్క ప్రాముఖ్యత, గ్రీన్ ఎరువు వలన కలిగే ఉపయోగాలు, జెండర్ సెన్సిటైసషన్ గురించి వివరించారు. అలాగే ఉత్తమ రైతుగా కోడెల మల్లేశంను గుర్తించి వారికి దేశ్పాండే ఫౌండేషన్ వారు సర్టిఫికెట్ తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేశ్పాండే ఫౌండేషన్ ఐఎన్టిల్ 17 సిద్దిపేట ఫీల్డ్ ఫెసిలిటేటర్ లు ధర్గయ్య, రవి, నరేందర్,నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.