Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

కెసిఆర్ అభివృద్ధి ప్రజల హృదయాల్లో పదిలం. అరెస్టులకు భయపడేది లేదు. స్థానిక సంస్థ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ విజయం ఖాయం  ఉమ్మడి మండల టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉప్పరి స్వామి ముదిరాజ్

కెసిఆర్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో పదిలంగా ఉన్నాయని దౌల్తాబాద్, రాయపోల్ ఉమ్మడి మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వీరనగర్ గ్రామ అధ్యక్షుడు ఉప్పరి స్వామి ముదిరాజ్ స్పష్టం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం కావాలనే బిఅర్ఎస్ నాయకులను బెదిరింపులను గురి చేస్తుందని, అరెస్టులు కేసులు బిఆర్ఎస్ పార్టీకి కొత్తమి కాదని ఆయన గుర్తు చేశారు. కెసిఆర్ 10 ఏళ్ల పాలనలో దేశంలోని తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీష్ రావు అరెస్టు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన మెజార్టీ ప్రజలు ఇప్పటివరకు బిఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని గుర్తు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో చేపట్టిన సంక్షేమ ఫలాలు ఇంటింటికి తీసుకువెళ్లి విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. పదేళ్ల అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం వెనకకు నెట్టి తెలంగాణ ఇమేజ్ ని దెబ్బతీస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని,అటు రైతులు సాగునీరు లేక,ఎరువు లేక ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలు ఆవలంబిస్తుందని ఆరోపించారు. రానున్న రోజుల్లో బిఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Related posts

గాయత్రి షుగర్స్ లో బీఎంఎస్ ఘనవిజయం

TNR NEWS

ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు 

TNR NEWS

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కారించాలి …. అదనపు కలెక్టర్ డి.వేణు

TNR NEWS

సీఎం సహాయ నిధి.. పేదలకు పెన్నిధి

TNR NEWS

బీ ఆర్ ఎస్ వి ఆధ్వర్యంలో గురుకుల బాట. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో సమస్యల పైన. గురుకుల పాఠశాలలో సందర్శించాలని బిఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 

TNR NEWS

తెలంగాణ జర్నలిస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి షాక్‌ ! – కొనసాగుతున్న సమీక్ష సమావేశం  – మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఇండ్ల స్థలాలు  – ఇప్పట్లో ఇచ్చేది లేదంటూ పరోక్షంగా వెల్లడి

TNR NEWS