సిర్పూర్ టి మండలం లోనవెల్లి గ్రామంలో ఆసాo రమేష్ అనే రైతుపై అడవి పంది దాడి చేసింది. పంట పొలంలో పనులు నిమిత్తం వెళ్తుండగా ఆకస్మాత్తుగా ఒక్కసారిగా అడవి పంది దాడి చేయడంతో రమేష్ కేకలు వేశారు. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి గాయాలైన రైతు రమేష్ ను ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కాగజ్నగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు.
జిల్లాలోని పలు గ్రామాలలో అటు పులి ఇటు అడవి పంది దాడుల వలన ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు పలు చర్యలను తీసుకోవాలని కోరుతున్నారు.