Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణపుణ్యక్షేత్రాలు

తొర్రూర్ లో ‘విశ్వబ్రాహ్మణ వేదవిద్వాన్మహాసభ, పంచదాయిల ఆత్మీయ సమ్మేళనం’  విశ్వబ్రాహ్మణుల ఐక్యతను సమాజానికి చాటి చెప్పాలి  ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు , సంస్కృతి పరిరక్షణలో విశ్వబ్రాహ్మణ పురోహితులు  సనాతన ధర్మ పరిరక్షణలో విశ్వబ్రాహ్మణ వేద పండితుల ప్రధాన పాత్ర : రామ గిరి విక్రమ్ శర్మ 

హిందూవుల ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు , సంస్కృతి పరిరక్షణలో అనాది నుండి విశ్వబ్రాహ్మణ పంచదాయిలు విశేష కృషి చేస్తూన్నారని రాగి విక్రమ్ శర్మ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా,తొర్రూర్ మండల కేంద్రంలో పురోహిత అర్చక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25 న తొర్రూర్ లోని తిరుమల ఫంక్షన్ హాల్ లో నిర్వహించనున్న ‘విశ్వబ్రాహ్మణ వేదవిద్వాన్మహాసభ, పంచదాయిల ఆత్మీయ సమ్మేళనం’ కార్యక్రమంను ఉద్దేశించి తొర్రూర్ మండల పురోహితుల అర్చక సంఘం అధ్యక్షులు రామ గిరి విక్రమ్ శర్మ మాట్లాడారు.దేశంలో సనాతన ధర్మ పరిరక్షణలో విశ్వబ్రాహ్మణ వేద పండితులు ప్రధాన భూమిక పోషిస్తున్నారన్నారు. సనాతన వైధిక బ్రాహ్మణులైన విశ్వబ్రహ్మణులు వేద శాస్త్రాలను అభ్యసించాలని సూచించారు.విశ్వబ్రాహ్మణ వేద పండితులు, విశ్వబ్రాహ్మణ పంచదాయిలు విద్యా వైజ్ఞానిక, సామజిక, ఆర్థిక, రాజకీయ పరంగా ఎదగాలన్నారు.. ఈ సందర్బంగా తొర్రూర్ మండల పురోహిత అర్చక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25 వ నిర్వహించనున్న ‘విశ్వబ్రాహ్మణ వేద విద్వాన్మహ సభ, పంచదాయిల ఆత్మీయ సమ్మేళనం ‘ న కు విశ్వబ్రహ్మణ వేద పండితులు, వాస్తు సిద్ధాంతులు, జ్యోతిష్య సిద్ధాంతులు , ఆగమ శాస్త పండితులు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల నుండి హాజరువుతారని వారు వెల్లడించారు. కావున విశ్వబ్రహ్మణ పంచదాయిలు ఈ కార్యక్రమంనకు అధిక సంఖ్యలో హాజరై విశ్వబ్రాహ్మణ ఐక్యతను సమాజానికి చాటి చెప్పాలన్నారు.

Related posts

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ కు ఘన సన్మానం

Harish Hs

యువత మాదకద్రవ్యాలు, ఆన్‌లైన్‌ బెట్టింగులకు దూరంగా ఉండాలి

TNR NEWS

ప్రణాళికా బద్ధంగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి

Harish Hs

మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త .. త్వరలో ఖాతాల్లోకి డబ్బులు!

TNR NEWS

రాజీవ్ శాంతినగర్ ఎత్తి పోతల పథకం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

TNR NEWS

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

TNR NEWS