Tnrnews.in
క్రీడా వార్తలుతెలంగాణ

కోలాహలాంగా ప్రారంభమైన పోలీసు క్రీడా పోటీలు

క్రీడలు ఐక్యతను చాటి చెబుతాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీస్ వార్షిక స్పోర్ట్స్ మీట్ -2025 ఖమ్మంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత పోలీసు క్రీడాకారుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శాంతి కపోతాలు ఎగురవేసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు.

కమిషనరేట్ పరిధిలోని ఖమ్మం టౌన్ ,ఖమ్మం రూరల్ ,వైరా ,కల్లూరు సబ్ డివిజన్ల సివిల్ పోలీసులు, ట్రాఫిక్, ఆర్మ్ డ్ రిజర్వ్ ఫోర్స్, స్పెషల్ వింగ్స్ స్టాఫ్ మొత్తం 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తున్నారు.

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ నరేష్ కుమార్, అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు, ఏఆర్ అడిషనల్ డీసీపీ విజయ బాబు, ట్రైనీ ఐపిఎస్ రుత్విక్ సాయి, ఏసీపీలు సాంబరాజు, నర్సయ్య, సుశీల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన వెలమ సంక్షేమ మండలి సభ్యులు

TNR NEWS

రాష్ట్ర కార్యదర్శిగా కనెవేని శ్రీనివాస్

TNR NEWS

ఎంపిడివో కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇంన్చార్జ్ సీఈవో …బాల్దూరి శ్రీనివాస రావు

TNR NEWS

స్వేరోస్ గ్రామ కమిటీ ఎన్నిక

TNR NEWS

అక్షర యోధుడు కాళోజి

Harish Hs

పత్తి దిగుమతులపై 50 శాతం పన్ను విధించాలి  _కేంద్ర ప్రభుత్వం పత్తిపై 11 శాతం దిగుమతి సుంకాన్ని తొలగిస్తూ విడుదల చేసిన నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలి ఆర్డీవో కార్యాలయం ముందు ఎస్ కే యం ఆధ్వర్యంలో ధర్నా 

TNR NEWS