పారదర్శకంగా నాలుగు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జరిగిందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం హుజూర్ నగర్ మండలం వేపాలసింగారం గ్రామం లో ప్రజాపాలన గ్రామ సభలో ఆర్ డి ఓ శ్రీనివాసులు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మాకంగా జనవరి 26 నుండి అమలు చేయబోయే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, నూతన రేషన్ కార్డులు మంజూరు లాంటి నాలుగు సంక్షేమ పథకాల గురించి ప్రజలకి తెలియజేసి, వారి అభిప్రాయాలను సేకరించటానికి ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.ఈ నాలుగు పథకాలకి అర్హులైన లబ్దిదారులకి అన్ని పథకాలు అందించటమే ప్రభుత్వ ఉద్దేశ్యం అని తెలిపారు.
రైతు భరోసా….
వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమం కొరకు రైతు భరోసా పథకం ద్వారా సేద్యం చేయు ప్రతి ఎకరానికి పెట్టుబడి సహాయానికి 12,000 రూపాయలను ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. వేపాలసింగారం గ్రామం లో సాగు చేయని భూములని 15:12 ఎకరాలు సిబ్బంది సర్వే చేసి గుర్తించటం జరిగిందని అట్టి భూములకి రైతు భరోసా పథకం వర్తించదని తెలిపారు.గ్రామ సభలో ప్రకటించిన సాగు చేయని భూముల జాబితా లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ధరఖాస్తు చేసుకోవాలని అట్టి దరఖాస్తులను క్షేత్ర స్థాయి లో పరిశీలించి రైతు భరోసా పథకానికి అర్హులైన వారి జాబితాను జనవరి 26 నుండి విడుదల చేయటం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
ప్రజపాలనలో భాగంగా భూమిలేని వ్యవసాయ కూలీలకి సంవత్సరానికి రెండు విడతలుగా 12,000 ఆర్థిక సహాయం చేయటానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుందని తెలిపారు. ఈ పథకం కొరకు మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లో నమోదు అయి ఉండి 2023-24 ఆర్థిక సంవత్సరం లో కనీసం 20 రోజులు పని చేసి భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించటం జరుగుతుందని ఈ గ్రామం లో 93 మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు దరఖాస్తు చేసుకున్నారని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కి సంబందించిన ఏమైనా అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. తదుపరి సిబ్బంది క్షేత్ర స్థాయి పరిశీలిన చేసి అర్హులైన వారి జాబితాను జనవరి 26 నుండి ఎంపిక చేయటం జరుగుతుందని తెలిపారు.
నూతన రేషన్ కార్డులు
రేషన్ కార్డు లేని వారు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న, ప్రజాపాలన లో దరఖాస్తు చేసుకున్న, అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి 648 దరఖాస్తులు వచ్చాయని కొత్త రేషన్ కార్డులకి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియపర్చాలని తదుపరి అర్హులైన లబ్ధిదారులను జనవరి 26 నుండి ఎంపిక చేయటం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఇందిరమ్మ ఇల్లులు
ఇండ్లు లేని వారు ప్రజాపాలన సభ లో దరఖాస్తు లు స్వీకరించటం జరిగిందని ఈ దరఖాస్తులు క్షేత్ర స్థాయి లో పరిశీలించి గుడిసెలు, రేకులు, పెంకుటిల్లులు, పక్కా ఇల్లులు, కిరాయి ఇండ్లలో ఉంటున్న వారిని గుర్తించి వారిలో అర్హులైన సొంత స్థలం ఉండి ఇండ్లు లేని నిరుపేదలను 356 దరఖాస్తులతో ఒక జాబితా, స్థలం లేని నిరుపేదలను 226 దరఖాస్తులతో మరో జాబితా తయారు చేయటం జరిగిందని ఇందిరమ్మ ఇల్లులకి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియపర్చాలని తదుపరి జనవరి 26 నుండి ఇల్లులేని అర్హులైన నిరుపేదలను ఎంపిక చేయటం జరుగుతుందని కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు.
ప్రజాపాలన గ్రామసభలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు కొరకు ప్రకటించిన లబ్ధిదారుల జాబితా లో పేర్లు లేకపోయినా,ఏమైనా అధికారుల తప్పిద్దాల వల్ల జాబితాలో అర్హులని అనర్హులుగా గుర్తించిన గ్రామ సభలో కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని అలాగే ఎంపిడిఓ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవకేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తదుపరి సిబ్బంది క్షేత్ర స్థాయి లో పరిశీలించి అర్హులైన నిరుపేదలను గుర్తించి జనవరి 26 నుండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేలా చూస్తామని కలెక్టర్ అన్నారు.
నేడు నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో రైతు భరోసా పథకం కొరకు 2 దరఖాస్తులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు 136 దరఖాస్తులు, కొత్త రేషన్ కార్డులు 63 దరఖాస్తులు ,ఇందిరమ్మ ఇండ్ల కొరకు 134 దరఖాస్తులు వచ్చాయని ఇట్టి దరఖాస్తులు క్షేత్ర స్థాయి లో పరిశీలించిన తర్వాత అర్హులని జనవరి 26 నుండి గుర్తిస్తామని ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమం లో తహసీల్దార్ నాగార్జున రెడ్డి, మండల వ్యవసాయ అధికారి స్వర్ణ, జి పి ప్రత్యేక అధికారి మౌనిక, ఏ పి ఓ శైలజ,సివిల్ సప్లై డి టి నాగేందర్,పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.