February 3, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలి

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని, విద్యార్థులు భోజనం చేసే గది ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని మునగాల మండల ప్రత్యేక అధికారి శిరీష అన్నారు.శనివారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ ను పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న కూరగాయలు, బియ్యం, ఇతరత్రా సామాన్లను పరిశీలించారు.అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పరిశుభ్రమైన త్రాగు నీరు అందించాలని అన్నారు. విద్యార్థులకు వేడివేడి ఆహార పదార్థాలను అందించాలని సూచించారు.ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం అన్ని మౌలిక వసతులు కల్పిస్తుందని వీటిని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, పాల్గొన్నారు.

Related posts

ఇండ్ల సర్వే పకడ్బoదిగా నిర్వహించాలి…. సర్వే త్వరగా పూర్తి చేయాలి….. జిల్లా అదనపు కలెక్టర్…..పి రాంబాబు 

TNR NEWS

శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన…ఎమ్మెల్యే విజయరమణ రావు..

TNR NEWS

యాంటి నార్కోటిక్స్ పై అవగాహన సదస్సు

TNR NEWS

పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి..నిందితుల పట్డివేత.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ. డీవీ.శ్రీనివాసరావు

TNR NEWS

కొండపల్లి గ్రామం లో అంగన్వాడీ భవనం కొరకు స్థలము పరిశీలించిన ఏం ఆర్ ఓ

TNR NEWS

ఆల్ ఇండియా బిసి, ఎస్ సి, ఎస్ టి, మైనారిటీ సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా తూర్పు రమేష్

TNR NEWS