అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని చాలా చోట్ల గత ప్రభుత్వ హాయంలో లక్షలు వెచ్చించి శ్మశాన వాటికలు నిర్మించారు,కాని విద్యుత్ సప్లై ఇవ్వడం మర్చారు.గ్రామీణ ప్రాంతాలలో ఎవరైనా పరంవధిస్తే అడవు లనుంచి కట్టెలు తీసుకువచ్చి చితికి కాల్చాల్సి ఉంటది,కానీ అటవీ అధికారులు మాత్రం కట్టెల కోసం ససేమిరా అంటున్నారు.కట్టెలు దొరకడం కష్టంగా మారింది. దీని కోసం గత ప్రభుత్వ స్మశాన వాటికలు నిర్మించినప్పటికి కరెంట్ సౌకర్యం లేక నిరూపయోగంగా మారింది. శ్మశాన వాటికలు ఉండి కూడా లాభం లేక పోయిందని గ్రామీన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంభందిత అధికారులు చొరవ చూపి విద్యుత్ సరఫరా చేసి శ్మశాన వాటికలను ఉపయోగం లోకి తీసుకొని రావాలని కోరుతున్నారు.