Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

న్యాయమూర్తి పై దాడి హేయమైన చర్య

న్యాయవస్థలో భాగమైన న్యాయవాదులతో పాటు న్యాయమూర్తులపై కూడా దాడి జరగటం దారుణమని, న్యాయమూర్తులపై దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ ఆర్ కె మూర్తి అన్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో గురువారం న్యాయమూర్తి పై నిందితుడి దాడిని నిరసిస్తూ శుక్రవారం కోదాడ పట్టణంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గౌరవప్రదమైన న్యాయవ్యవస్థలో గతంలో న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయని, ఇప్పుడు న్యాయమూర్తులపై దాడులు జరగటం విచారకరమన్నారు. న్యాయవాదులపై న్యాయమూర్తి పై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చి వాటిని అమలు చేయాలన్నారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల రామిరెడ్డి, కార్యవర్గం కోడూరు వెంకటేశ్వరరావు, హేమలత, ధనలక్ష్మి, దొడ్డా శ్రీధర్, సీనియర్ న్యాయవాదులు సాధు శరత్ బాబు, ఎం వి ఎస్ శాస్త్రి, ఎడ్లపల్లి వెంకటేశ్వర్లు, రాజన్న, మంగయ్య గౌడ్, ఉయ్యాల నరసయ్య, అబ్దుల్ రహీమ్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

డ్రగ్స్,సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

TNR NEWS

ఏఐఎస్ఎఫ్ నాయకుల ముందస్తు అరెస్టు

TNR NEWS

ఘనంగా కార్తీక సోమవారం పూజలు

TNR NEWS

డిసెంబర్ 2న సిపిఎం బహిరంగ సభ జయప్రదం చేయాలని కరపత్రం విడుదల నన్నూరి వెంకటరమణారెడ్డి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు

TNR NEWS

మేడిపల్లి మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు

TNR NEWS

మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత

Harish Hs