కే.ఆర్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ మరియు హార్ట్ ఫుల్ నెస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో
విద్యార్థులకు “హెల్ప్” కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వేముల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా హార్ట్ ఫుల్ నెస్ సంస్థ సెంట్రల్ కో-ఆర్డినేటర్ కె .శివరామ ప్రసాద్ పాల్గొని “ధైర్యము-విశ్వాసం” అనే అంశముపై ఆయన మాట్లాడుతూ… సంకల్ప బలం ఉంటే దేన్నైనా సాధించవచ్చునని, ముఖ్యంగా హార్ట్ ఫుల్ మెడిటేషన్ ద్వారా ఒత్తిడిని తగ్గిస్తుందని, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆత్మబలం, మనోనిబరం పెంచుకోవచ్చు అని ఆయన అన్నారు. ధ్యానము వలన ప్రతి ఒక్కరూ మంచి నడవడిక, సత్ప్రవర్తనను కలిగి ఉండవచ్చును అన్నారు. భూమి నుండి వచ్చే ప్రాణ శక్తితో మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు అని అన్నారు. ధ్యాన శిక్షకులు, హార్ట్ ఫుల్ నెస్ ఆర్గనైజేషన్ కార్యకర్త సి.హెచ్. వెంకటరెడ్డి మాట్లాడుతూ… హెల్ప్ అనే కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచుతూ, మానసిక ఒత్తిడికి దూరమయ్యేలా, పరీక్షలలో విద్యార్థి ఒత్తిడికి గురికాకుండా మెలకువలు చెబుతున్నామని, కళాశాలలో శిక్షణను ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం మూడు రోజులపాటు ప్రతిరోజు ఒక గంట సేపు జరుగుతుందని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వేముల వెంకటేశ్వర్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జి. యాదగిరి, వి .బల భీమారావు, జి.నాగరాజు, ఆర్ .రమేష్ శర్మ, రత్నకుమారి,పి. రాజేష్, బి. రమేష్ బాబు, పి. తిరుమల, ఎస్. గోపికృష్ణ, ఎం.చంద్రశేఖర్, ఈ. నరసింహారెడ్డి, ఎస్. కే. ముస్తఫా, ఎస్ .కే .ఆరిఫ్, ఎన్ .రాంబాబు, కె.శాంతయ్య, ఆర్. చంద్రశేఖర్, ఎస్. వెంకటాచారి, జ్యోతి, మమత, డి.ఎస్. రావు విద్యార్థులు పాల్గొన్నారు.