మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన నిట్టూరి కిరణ్ కుమార్ అనే పేషెంట్ కు 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి విజ్జన్న యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం వినోద్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు రెండు దశాబ్దాల కాలంగా నిరంతరం సేవా కార్యక్రమాల ద్వారా నిరుపేదల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అల్లo వినోద్ రెడ్డి స్పందించి కిరణ్ కుమార్ కొద్దిగా రోజులుగా మంచానికి పరిమితమై లేవలేని స్థితిలో ఉన్న యువకుడికి చేయూతనిచ్చారు. ఓ మిత్రుడు ద్వారా సమాచారం తెలుసుకున్న వినోద్ రెడ్డి చలించి నెలమందులు సైతం కొనుక్కోలేని దీన స్థితిలో ఉన్న కిరణ్ కుమార్ వద్దకు స్వయంగా వెళ్లిన అల్లo వినోద్ రెడ్డి సోమవారం ఆయన ఇంటికి వెళ్లి గమనించి.. విచారం వ్యక్తం చేసి విజ్జన్న యువసేన వంతుగా 5000 సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే విజయరమణారావుపై అపారమైన గౌరవంతో విజ్జన్న యువసేనను స్థాపించి ఆపదలో ఉన్నవారికి విజ్జన్న యువసేన పక్ష్ణానసహాయాన్ని అందిస్తున్నామన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 20 ఏళ్లకు పైగా ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామన్నారు. విజ్జన్న యువసేన సేవా కార్యక్రమాలు మునుముందు ఉంటాయన్నారు. నిజమైన నిరుపేదలకు సాయం అందించడమే విజ్జన్న యువసేన లక్ష్యం అన్నారు.ఈ కార్యక్రమంలో తాడూరి శ్రీమాన్, నిట్టూరి ప్రభుదాస్, అమృత ఆసంపల్లి బుచ్చయ్య, ఎడెల్లి రాములు, ఇంద్ర, తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే విజయ రమణారావు నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు విజ్జన్న యువసేన పక్షాన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం వినోద్ రెడ్డి ప్రకటించారు.
