Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి. ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇవ్వాలి. మహిళ జర్నలిస్టుల కోసం రవాణా సౌకర్యం కల్పించాలి. టిడబ్ల్యూజేఎఫ్ వికారాబాద్ జిల్లా కమిటీ సమావేశంలో  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య

వికారాబాద్ జిల్లా కేంద్రం లో సోమవారం నాడు అనంతగిరి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో టి డబ్ల్యూ జేఎఫ్ వికారాబాద్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు ఎం రవీందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవపునయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న సంఘం టి డబ్ల్యూ జె ఎఫ్ సంఘం మాత్రమే అని, సంఘ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు నిరంతరం మంత్రులను అధికారులను కలిసి జర్నలిస్టుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నామని చెప్పారు.రైల్వే పాసుల పునరుద్దించాలని రైల్వే నిలయం ముందు ధర్నా చేశామని, అందరికీ ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు పలుమార్లు మంత్రులకు మెమోరండాలు ఇచ్చామన్నారు.హెల్త్ కార్డుల కోసం కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. సమస్య పరిష్కరించే విధంగా నాయకులు కృషి చేస్తేనే మనపై నమ్మకం ఏర్పడి సంఘ అభివృద్ధి కోసం అందరూ వస్తారని అన్నారు.అందరి శ్రేయస్సు కోరుకున్న వారే నాయకత్వ స్థానంలో ఉంటారని ఆయన అన్నారు. సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని జిల్లా నాయకత్వానికి ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎండి షఫీ, కమిటీ సభ్యులు బి సంజీవ్, వెంకట్ రామ్ రెడ్డి, బాలరాజు, జర్నలిస్టులు మాణిక్యం, అరుణ్, కుమార్, జగన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో పోటెత్తిన భక్తులు

Harish Hs

కోదాడలో ఘనంగా నాభి శిలా బొడ్రాయి ఏడవ వార్షికోత్సవం

TNR NEWS

కులమతాలకు అతీతంగా సెమి క్రిస్మస్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సెమి క్రిస్మస్

TNR NEWS

బిసి ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Harish Hs

సిగ్నల్ జంపింగ్, స్టాప్ లైన్ క్రాసింగ్ పై అవగాహన ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం

TNR NEWS

అరుహులందరికీ సంక్షేమ ఫలాలు — ఎమ్మెల్సీ దండే విఠల్

TNR NEWS