కోదాడ పట్టణంలోని అనంతగిరి రోడ్డులో గల గుట్టపై లింగమంతుల స్వామి జాతరను కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లింగా ఓలింగ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులు బోనాలు సమర్పించి యాటపోతులతో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు…..