పిఠాపురం : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని బుధవారం సాయంత్రం జియో నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సిఈఓ మందపల్లి మహేష్ దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు స్వామివారి విశిష్టతను, స్థలపూరణం వివరించారు. ఆనంతరం ఆలయంలో వున్న గణపతి, దత్త్రాత్రేయస్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు, 10వ శక్తిపీఠం పూరుహుతికా అమ్మవారు దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ సహయ కమీషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి కాట్నం జగన్మోహన శ్రీనివాస్ స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట ఏరియా హెడ్ విశ్వనాధ్ పంతుల, తదితరులున్నారు.

previous post