Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఆదిత్యలో ఉదాన్ 11వ వార్షికోత్సవం

పిఠాపురం : పట్టణంలోని సీతయ్య గారి తోటలో వున్న ఆదిత్య పాఠశాలలో ఉదాన్11వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నృత్యం, బుర్రకథలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆదిత్య పాఠశాల పూర్వం విద్యార్థి, ప్రస్తుత కొవ్వూరు ఆర్డిఓ రాణిసుస్మిత జ్యోతిని వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇష్టపడి చదివితే విజయాలు వరిస్తాయని కొనియాడారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థలు చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, డైరెక్టర్ శృతిరెడ్డి, ప్రిన్సిపాల్ విజయసారథి, డాక్టర్ మొగిలి కాశీవిశ్వనాథం, రేవతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తిరుమల శ్రీవారి సమాచారం…

TNR NEWS

ఈ నెల 31న కాంట్రాక్టు లెక్చరర్స్ రాష్ట్ర కౌన్సిల్ అత్యవసర సమావేశం

Dr Suneelkumar Yandra

ప్రజాసేవ చేయడంలోనే నాకు సంతృప్తి ఉంది – జనసేన నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్)

Dr Suneelkumar Yandra

కాకినాడ ఈద్గా మైదానం కోర్టుకేసులు పరిష్కరించాలి.. అభివృద్ధి చేయాలి – ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎం, మైనారిటీ, ఐటి, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రులకు పౌర సంక్షేమ సంఘం లేఖ

Dr Suneelkumar Yandra

ఏపీలో ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదల*

TNR NEWS

మార్చి 22న ‘ఎర్త్ అవర్’ పాటించండి – గవర్నర్ అబ్దుల్ నజీర్

Dr Suneelkumar Yandra