Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి – ఎఐటియుసి డిమాండ్

పిఠాపురం : ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధం పిఠాపురం శాఖ యూనియన్ అధ్యక్షులు బంగారు కన్నయ్య ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్  రాష్ట్ర పిలుపు మేరకు ఫిబ్రవరి 17 నుండి మార్చి 3వ తేది వరకు దసలవారీ ఆందోళన మార్చి 6వ తేదీన చలో విజయవాడ పెద్ద ఎత్తున తరలిరావాలని శనివారం స్థానిక మస్తర్ ఆఫీసు ఆవరణలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి, ఆప్కాస్ట్ రద్దు చేస్తే పర్మినెంట్ చేయాలని, జీతాలు పెంపు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, కార్మికులు చనిపోయిన వారి స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగ కల్పన కల్పించాలని తదితర డిమాండ్లుతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు సాకా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాజకీయంలో ఎంతో సర్వీసున్న చంద్రబాబు నాయుడు మా కార్మికులు సర్వీసును దృష్టిలో పెట్టుకుని పర్మినెంట్ చేయాలని, జీతాలు పెంపు చేయాలని, కమ్యూనిస్టు భావాలు ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టు ఆలోచనతోనే వర్కర్ల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. ఆప్కాస్ పోయి  ప్రైవేటు ఏజెన్సీలకు ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే సహించబోవని డైరెక్ట్ గా పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముత్యాల అప్పారావు, చెక్క అప్పలకొండ, పొట్నూరు అమ్ములు, ధనాల సతీష్, గూడుపు సత్యవతి, లంక ప్రసాద్, చిటికెలు దాసు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా కుక్కుటేశ్వరుడి రథోత్సవం

Dr Suneelkumar Yandra

గొల్లప్రోలులో అడ్డగోలుగా అక్రమ లేఅవుట్లు – చోద్యం చూస్తున్న అధికారులు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం

TNR NEWS

కాకినాడగణపతిపీఠంలో 53మంది ఉపవాసకులతో ఘనంగా జరిగిన మాఘ సంకష్టహర చతుర్థి

Dr Suneelkumar Yandra

ఆరోగ్య భీమా ప్రీమియంపై జిఎస్టి భారం తగ్గించాలి – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

Dr Suneelkumar Yandra

జనసేన ఆవిర్భావ సభ వేదిక నిర్మాణానికి భూమి పూజ