భారీగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, అధికారులు, మహిళామణులు
నారాయణవనంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు
తిరుపతి జిల్లా సత్తివేడు నియోజకవర్గం నారాయణనం మండల కేంద్రంలో సత్యవేడు శాసనసభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు
మండల కేంద్రంలోని నారాయణవనం మేజర్ పంచాయతీ కసిమిట్టకు వెళ్లే మార్గంలోని సందు వీధిలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు
సుమారు 8 లక్షల రూపాయల వ్యయంతో 200 మీటర్ల దూరం వరకు ఈ సిమెంట్ రోడ్డును నిర్మించడం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం తెలిపారు
కొన్నేళ్లుగా ఈ వీధిలో ప్రజలు రాకపోకలు సాగించడానికి చాలా ఇబ్బందులు పడే వారిని వాటిని గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఐటీ శాఖ మంత్రి శ్రీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రారంభమైన పల్లె పండుగ కార్యక్రమంలో ఈ వీధికి సిమెంట్ రోడ్డు రాబోతుందని గుర్తు చేశారు
నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోనూ ఆయా పంచాయతీల్లో ఇప్పటివరకు సిమెంట్ రోడ్డులు మురికినీటి కాలువలు నిర్మాణానికి నోచుకోకుండా ఉందని వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి సహకారంతో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ఈ పనులన్నిటిని పూర్తి చేయించి ప్రజలకు మేలు చేకూర్చడం జరుగుతుందన్నారు
అనంతరం రెడ్డి వీధిలోని సిటిజన్ చార్ట్స్ ను ప్రారంభించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారిని జడ్పీ ఫైనాన్స్ కమిటీ మెంబర్ శ్రీ కోనేటి సుమన్ కుమార్ గారిని నారాయణవనం మేజర్ పంచాయతీ సర్పంచ్ శారదమ్మ గణేష్ వారి తనయులు రామ లక్ష్మణులు దుష్వాలువ పూలమాలతో సత్కరించారు
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఇ ఉమా శంకర్ ఎంపీడీవో గుణశేఖర్ తహసిల్దార్ఈవో పి ఆర్ డి డాక్టర్ వేనయ్య ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో సుకన్య వెలుగు ఏపిఎం మమత నారాయణ పంచాయతీ ఈవో కెపి షణ్ముగం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పి గోవిందస్వామి టీ ఊరప్పగోవింద శెట్టి స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళా మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు