పిఠాపురం : పిఠాపురం పట్టణంలోని జగ్గయ్య చెరువులో నివసిస్తున్న కేశబోయిన నవీన అనే ఒక మహిళకు గర్భాశయంలో కాయలతో ఇబ్బంది పడుతూ మూడుసార్లు ఆపరేషన్ చేయడం జరిగింది. సమస్య తీరక ఇంకోసారి ఆపరేషన్ చేయాలని, పస్తుతం ఆమె హాస్పిటల్లోనే ఉన్నారని తెలుసుకున్న మన పిఠాపురం ఎమ్మెల్యే గారి సేవా సంస్థ ప్రతినెలా చేసే ఆర్ధిక సహాయలో భాగంగా మన పిఠాపురం ఎమ్మెల్యే గారి సేవా సంస్థ తరపున మంగళవారం ఆమెకు సంస్థ తరపున రూ.9వేలు అందజేయడం జరిగింది. అదే విధంగా ఈ కార్యక్రమానికి సహాయం చేసినటువంటి సభ్యులందరికీ సంస్థ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తమ సంస్థ కష్టాల్లో వున్నవారికి సహాయం చేయడానికి ముందు వుంటుందని, ఎవరికైనా కష్టం వస్తే మన పిఠాపురం ఎమ్మెల్యే గారి సేవా సంస్థను సంప్రదించాలని సంస్థ సభ్యులు కోరారు.