కాకినాడ : ఆరోగ్య భీమా ప్రీమియం సామాన్యుడికి మధ్య తరగతికి అందనంత ఖరీదైన ప్రక్రియగా మారుతున్నదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. వైద్య చికిత్స భారం కావడం వలన ఆరోగ్య భీమా ప్రీమియం 15 నుండి 20 శాతం పెరుగుతుండడం వలన ఆందోళన చెందుతున్న ప్రభావం ఏర్పడిందన్నారు. భీమాపై 18శాతం జిఎస్టి వస్తు సేవల పన్ను విధించడం వలన పాలసీదారులకు ఉపశమనం దక్కడంలేదన్నారు. కొందరు వీటిని భరించలేక పాలసీలను వదిలేస్తున్న దుస్థితి వుందన్నారు. తీవ్ర భారం కావడం వలన ప్రయివేటు సంస్థల్లోని ఉద్యోగులు స్వంతంగా పాలసీ తీసుకునే అవకాశం చేయకపోవడంతో ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో భీమా రక్షణ దక్కడం లేదన్నారు. భీమా పాలసీ చేసిన ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెరిగే కొద్దీ ప్రీమియం రేటు పెరగడం వలన జీవన పొదుపు చేసుకోలేని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జిఎస్టి భారాన్ని 5 శాతం మించకుండా విధించే ప్రక్రియను ప్రభుత్వం వహించాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు. లేకుంటే ఆరోగ్య భీమా అన్ని వర్గాలకు అందని వైద్యంగా వుంటుందన్నారు.