Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

దుకాణాల వద్ద మద్యపాన నిషేధంఅమలు చేయాలి..

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు శిక్షలు జరిమానాలు అమలవుతున్నా మద్యం సేవించి వాహనాలు నడిపే సంఖ్య తగ్గడం లేదు!!

 

పౌర సంక్షేమ సంఘం డిమాండ్

 

కాకినాడ : వైన్ షాపుల వద్ద మద్యం సేవించే ప్రక్రియకు యధేచ్చగా స్వేచ్చ అవకాశం ఇవ్వడం వలన మద్యం సేవించి వాహనాలు నడిపే వారు ఎక్కువయ్యారని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో రెండు ట్రాఫిక్ పోలీస్ అధికారుల పరిధిలో రోడ్ యాక్సిడెంట్లు తగ్గించే  ఉద్దేశ్యంతో మద్యం తాగి వాహనం నడుపుతున్న వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ లో గుర్తించి ప్రమాదాలకు తావు లేకుండా  కేసులు నమోదు చేసి  ధర్డ్ క్లాస్ అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరు పర్చడం ద్వారా  విధించబడుతున్న జరిమానాలు శిక్షలు ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రధానంగా  అందుబాటులో వుంటున్న మద్యం దుకాణాల వద్ద తాగి మోటారు సైకిళ్ల మీద ప్రయాణించడం ఎక్కువయ్యిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో రోజుకు రెండుకోట్ల రూపాయలకు పైగా జరిమానాలు సగటున 900 మంది కేసులకు, శిక్షలకు గురవుతున్నా మద్యం సేవించి వాహనాలు నడిపే ప్రక్రియ ఆగడం లేదన్నారు. కాకినాడ నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారు ఎక్కువ కావడం వలన రోజుకు 25మందికి పైగా కేసులు రూ.2లక్షల జరిమానాలు, పలు శిక్షలు అమలవుతున్న రికార్డులు అధికం అవుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తగ్గడం లేదన్నారు. వైన్ షాపుల వద్ద మద్యం సేవించే ప్రక్రియను కఠినంగా నియంత్రణ చేయక పోవడమే ఇందుకు గల ప్రధాన కారణమన్నారు. వైన్ షాపుల వద్ద సి సి కెమెరాలు ఏర్పాటు చేయించి కమాండింగ్ సెంటర్ ద్వారా బహిరంగ మద్యపానం నిలువరించే చర్యలు ప్రభుత్వం వహించాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు. పటిష్టంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహణ చేస్తున్న పోలీస్ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్చగా మద్యం సేవించే ప్రక్రియను పూర్తిగా నిషేధించే చర్యలు వహిస్తేనే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు.

Related posts

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేగుళ్ళ

Dr Suneelkumar Yandra

లక్ష తెల్లజిల్లేడు పువ్వులతో ఉచ్ఛిష్ట గణపతికి చతుర్థి నీరాజనం

Dr Suneelkumar Yandra

ఓటర్ ఐడి కిఆధార్ అనుసంధానం పట్ల హర్షం

Dr Suneelkumar Yandra

నిద్రావస్థలో పిఠా‘‘పుర’’ం శానిటేషన్‌  – పట్టించుకోని అధికారులు – రోగాల బారిన ప్రజలు నానాఅవస్థలు – స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు అభ్యర్ధన

TNR NEWS

నిరక్షరాస్యత నిర్మూలన పై ప్రత్యేక శ్రద్ధ

Dr Suneelkumar Yandra

మహిళలందరికీ పెద్ద పీట వేసింది జనసేన పార్టీ