Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్రాజకీయం

సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ రూపొందించామన్న చంద్రబాబు

బడ్జెట్ ప్రకటన అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షత టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ప్రజలకు మంచి బడ్జెట్ అందిస్తున్నామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ కు రూపకల్పన చేశామని అన్నారు. గత వైసీపీ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలు గుర్తించారని తెలిపారు. ఈ బడ్జెట్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలని, వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్ దక్కాలంటే ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రావాలని తేల్చి చెప్పారు. మళ్లీ అసెంబ్లీకి రావాలి అనే భావనతో ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఎక్కడా విభేదాలకు తావు లేదని, గ్రూపులు కడితే సహించేది లేదని హెచ్చరించారు.

Related posts

నాడు ఇందిరాగాంధీ ప్రకటిత ఎమర్జెన్సీ….  నేడు మోడీ అప్రకటిత ఎమర్జెన్సీ…  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి 

TNR NEWS

ఏపీలో బీచ్‌లకు ప్రవేశ రుసుం.. మంత్రి క్లారిటీ

TNR NEWS

రాళ్లకత్వలో ఘనంగా మల్లన్న జాతర – ముఖ్య అతిథులుగా హాజరైన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి మాజీ జెడ్పిటిసి కొలన్ బాల్రెడ్డి

TNR NEWS

అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేయాలి సిపిఎం నాయకులు మెదరమెట్ల వెంకటేశ్వరరావు

TNR NEWS

ఎన్నికల మేనిఫెస్టో అమలుపై ధైర్యంగా చెప్పండి. 

TNR NEWS

పోలీసుల సంక్షేమానికి ఏడాదికి రూ. 20 కోట్లు చొప్పున ఇస్తాం*

TNR NEWS