- ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎం, ఇన్ ఛార్జ్ మున్సిపల్ మంత్రులకు ఇ-మెయిల్ వినతి పత్రం
- పౌర సంక్షేమ సంఘం
కాకినాడ : పిఠాపురం పట్టణం రోడ్ల విస్తరణలో ఉపాధి కోల్పోయిన బడ్డీ యజమానులకు, చిరు వ్యాపారులకు వారి కుటుంబ భద్రత కోసం శాశ్వత పునరావాస అవకాశం ఇవ్వాలని పౌర సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. 1999లో అప్పటి తెదేపా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తరోడ్ల విస్తరణ నిర్వహణలో భాగంగా బడ్డీ యజమానుల సంక్షేమ సంఘం చేపట్టిన ప్రజా ఉద్యమం ద్వారా ఉపాధి కోల్పోయిన బడ్డీ యజమానులకు, చిరువ్యాపారులకు పబ్లిక్, ప్రయివేట్ పార్టనర్ షిప్ పద్ధతిలో ప్రభుత్వ స్థలాలు, మున్సిపల్ మైదానాల్లో రోడ్లను ఆనుకుని 4×6 సైజులో పెట్టీ షాపులు నిర్మించే ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో అమలు చేయించారని, ఇప్పుడు అదే పద్ధతిని అమలు చేయాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జిల్లా ఇన్ ఛార్జ్ మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణలను సంఘం వినతిపత్రాన్ని మెయిల్ చేసారు. ప్రభుత్వం మున్సిపాలిటీపై ఆర్థిక భారం లేకుండా నిర్వాసిత బడ్డీ యజమానులకు పిఠాపురంలో పి4 ప్రణాళికగా జనతా షాపులు నిర్మించాలని సూచించారు.