Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రఘు కుటుంబాన్ని పరామర్శించిన, ఎంజెఎఫ్ జాతీయ అధ్యక్షుడు దాసు

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పడిశాల రఘు ఇటీవల మృతి చెందడంతో.. శుక్రవారం రఘు నివాసానికి చేరుకొని రఘు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాదిగ జర్నలిస్టుల జాతీయ అధ్యక్షుడు దాసు మాట్లాడుతూ… కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా జర్నలిస్టుల తరఫున ముందుండి ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టాడని అలాగే మాదిగ జర్నలిస్టులకు రాష్ట్ర నాయకుడిగా ఎన్నో సేవలందించారంటూ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రఘు కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. పడిశాల రఘు మృతి పట్ల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారని తెలిపారు. రఘు కుటుంబాన్ని పరామర్శించేందుకు మంద క్రిష్ణ మాదిగ కూడా సిద్ధంగా ఉన్నారని త్వరలోనే రఘు కుటుంబాన్ని పరామర్శిస్తారని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాదిగ జర్నలిస్టులు మరియు ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలు నాయకులందరూ రఘు కుటుంబానికి అండగా ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఎం జె ఎఫ్ రాష్ట్ర నాయకులు కోట రాంబాబు, బంక వెంకట్ రత్నం, పిడమర్తి గాంధీ, జిల్లా నాయకులు బొంగారాల మట్టయ్య, తోటపల్లి నాగరాజు, రవీందర్ , నియోజకవర్గ నాయకులు చెరుకుపల్లి శ్రీకాంత్,సత్యరాజ్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పాడి రైతుల సంక్షేమానికి కృషి……..  రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం……  రైతులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి……  కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి……

TNR NEWS

నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరం

TNR NEWS

దాడి చేసి క్షమాపణ చెబితే సరిపోతుందా..! జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి.. తక్షణమే మోహన్ బాబును అరెస్టు చేయాలంటూ డిమాండ్… ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు

TNR NEWS

మూడవ జిల్లా మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ

Harish Hs

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి  కార్తీక మాసం ఆధ్యాత్మికతకు ప్రతీక  శివుని అనుగ్రహంతో కోదాడ పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి

TNR NEWS

8వేల ఎకరాల భూమిని గుర్తించాం:అదనపు కలెక్టర్

TNR NEWS