మునగాల మండల కేంద్రంలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై మునగాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుంచి విద్యుత్ సబ్స్టేషన్ వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టం వెలగక పోవడంతో చీకట్లు కమ్ముకున్నాయి. సామాజిక సేవ కార్యకర్త గంధం సైదులు అన్నారు. గత మూడు రోజుల నుంచి లైట్లు వెలగకపోవడంతో వాహనదారులు ప్రమాదాల గురవుతున్నారు. ముఖ్యంగా జంక్షన్ ల వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సర్వీస్ రోడ్డుపై వెళ్తున్న వారు కూడా వీధుల్లోకి వెళ్లే దారి తెలియక ఇబ్బందులకు గురవుతున్నారు. తక్షణమే ఎన్ హెచ్ ఎ ఐ ఆఫీసర్లు స్పందించి లైట్లను పునరుద్ధరించాలని కోరుతున్నాను. లేని పక్షంలో ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాను.