Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

మునగాల ఆదర్శ పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు

సైన్స్ పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని,సమాజంలో మూఢ విశ్వాసాలను పోగొట్టి శాస్త్రీయ ఆలోచనలు కల్పించేందుకు సైన్స్‌ దోహదపడుతుందని మునగాల మండల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సైదయ్య గౌడ్ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శ పాఠశాలలో సీవీ రామన్ జన్మదిన సందర్భంగా సైన్స్ డే ను ఘనంగా నిర్వహించారు. సైన్స్ డే సందర్భంగా పాఠశాలలో విద్యార్థులచే సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. సైన్స్ ఫెయిర్ లో విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ నమూనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సైదయ్య గౌడ్ మాట్లాడుతూ.. సైన్స్ డే ను పురస్కరించుకొని పాఠశాలలు విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించమని తెలిపారు.సమాజానికి మేలు చేసే వస్తువులను, విషయాలను కనుగొనేందుకు తమ జీవితాలను ధారపోసిన శాస్త్రవేత్తలను ప్రతీ విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్ట్ గాంధీ తండ్రి మృతి బాధాకరం… •సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్..

TNR NEWS

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దు* * రౌడీ మేళాలో హెచ్చరించిన డిఎస్పీ రాములు

TNR NEWS

కొనసాగుతున్న సైన్స్ ఫేర్   ఆకట్టుకున్న ఐఆర్ బేస్డ్ ట్రాఫిక్ డెన్సిటీ సిగ్నల్ అడ్జస్ట్మెంట్ 

TNR NEWS

మున్సిపల్ అభివృద్ధికి సహకరించిన మున్సిపల్ కౌన్సిలర్లకు నాయకులకు ప్రతి ఒక్కరి ఒక్కరికి ధన్యవాదాలు.  మీడియా మిత్రులకు ధన్యవాదాలు.  మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్

TNR NEWS

సిఐ గా పదోన్నతి పొందిన ఎస్సై రంజిత్ రెడ్డి

Harish Hs

ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో గ్రాండ్ టెస్ట్

Harish Hs