భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పనకు అన్ని మండలాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహణకు షెడ్యూల్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో
మంగళవారం భూ భారతి నూతన రెవెన్యూ చట్టం పై
అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతి మండలంలో భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహణకు షెడ్యూల్ రూపకల్పనతో పాటు అన్ని ఏర్పాట్లు చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. రాష్ట్రంలో భూభారతి చట్టాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు నుండి మొదలు పెట్టడం జరిగిందని రెవెన్యూ సిబ్బంది అందరికీ ఈ చట్టంపై పూర్తి అవగాహన ఉండాలని ప్రతి రోజు ఒక 30 నిమిషాలు భూభారతి పోర్టల్ లో పొందుపరిచిన విషయాలను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు ప్రతి తహసిల్దార్ కార్యాలయంలో భూ భారతి చట్టం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి చట్టంపై ప్రజలకు సలహాలు, సూచనలు అందచేయాలని సూచించారు. మండల స్థాయిలో రెవెన్యూ సమస్యలపై సమగ్రమైన నోట్స్ తయారు చేయాలని ఆయన స్పష్టం చేశారు. నూతన చట్టం ప్రకారం మాత్రమే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, సక్సేషన్లు, సాదా బైనామ చేయాలని తెలిపారు. భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై రెవెన్యూ అధికారులు సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. భూ సమస్యల పరిష్కారం కొరకు వచ్చే ప్రజలతో గౌరవప్రదంగా వ్యవహరించాలని, ప్రజల సమస్యలను సావధానంగా విని పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని పైలెట్ ప్రాజెక్ట్ క్రింద ములుగు, ఖమ్మం నారాయణపేట, కామారెడ్డిలలో ఒక్కొక్క మండలాన్ని ఎంపిక చేసిందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రజల నుండి వచ్చే సమస్యలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదికలు పంపాల్సి ఉంటుందని తెలిపారు. వేసవి దృష్ట్యా అవగాహన సదస్సులు నిర్వహణ లో అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తాసిల్దార్ లో తమ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించాలని తెలిపారు ఇతర రాష్ట్రాల నుండి సన్న వడ్లు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు తాసిల్దార్లు కుల ఆదాయ ముద్రవీకరణ పత్రాలను వేంటనె ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన జూనియర్ అసిస్టెంట్లు బాగా పనిచేయాలని అందరూ యువకులే కావున రెవెన్యూ అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో సూర్యపేట ఆర్టీవో వేణుమాధవరావు, కోదాడ సూర్యనారాయణ, హుజూర్నగర్ శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్ రెడ్డి, సూపర్డెంట్లు సాయి గౌడ్, శ్రీనివాసరాజు, తహసిల్దారులు, డిప్యూటీ తాసిల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.