Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

బ్రహ్మ కడిగిన శ్రీవారి పాదాలు

కాకినాడ : ఏడుకొండల స్వామి ఆరాధకులు గోవింద గోవిందా అంటూ అలిపిరి నుండి కాలినడకన తిరువేంకటగిరికి దారి చూపిన గోవిందుని పాదాలు బ్రహ్మ కడిగిన పరమపద పాదాలని తిరుమల పాదయాత్ర గురుస్వామి స్వయంభు భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. పాదయాత్ర పూర్తి చేసి చేపట్టిన108 వారాల జపయజ్ఞ పారాయణ సందర్భంగా కాకినాడ సూర్యారావు పేట దూసర్లపూడి వారి వీధిలో వేంచేసియున్న భోగి గణపతి పీఠంలో శనివారం ఉదయం 74వ వ్రత ఆరాధనగా శివకేశవులకు శ్రీముఖ పూజలతో పంచామృత అభిషేకాలు నిర్వహించారు. శ్రీవారి భక్తులు సుప్రభాత వేళలో సామూహికంగా చేసిన సహస్ర గోవింద నామ పారాయణ అలరించింది. శివపూజ బియ్యాన్ని పంపిణీ చేసారు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది రోజున 1008 శ్రీవారి పాదాల కలర్ ఫోటో ప్రింట్ కార్డులు పంపిణీ చేస్తామని పీఠం నిర్వాహకులు తెలియజేసారు.

Related posts

సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ శ్రీపతి

TNR NEWS

రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలలో బండారు శ్రీనివాస్ విస్తృత ప్రచారం

Dr Suneelkumar Yandra

రూ.2.94 లక్షల కోట్ల తో ఏపీ వార్షిక బడ్జెట్

TNR NEWS

జామియా మసీదు వద్ద జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు పూర్తి చేయాలి – సిఎం హామీ పూర్తి చేయాలి

Dr Suneelkumar Yandra

భక్తి శ్రద్ధలతో శ్రీ షిరిడీ సాయిబాబా వారి 19వ ఆలయ వార్షికోత్సవం

Dr Suneelkumar Yandra

పీతల సత్యనారాయణ పదవీ విరమణ