ఎన్టీఆర్ జిల్లా/నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ నందు ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రంజాన్ నెల ప్రారంభం కానున్న సందర్భంగా వారి కార్యాలయంలో ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో మీరు చేసే ప్రార్థనలు ఫలించాలని కోరుకుంటూ… తంగిరాల సౌమ్య అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ ఈనెల మొత్తం ముస్లిం సోదరులు ప్రార్థన (నమాజ్) చేసుకునే ప్రదేశాల వద్ద పారిశుద్ధ్యత లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నమాజ్ వేళలలో ముస్లిం సోదరులకు కల్పించవలసిన మౌలిక సదుపాయాలను ఎక్కడ లోటు లేకుండా చూడాలని, విద్యుత్ దీపాలంకరణ పై దృష్టి పెట్టాలన్నారు. పారిశుద్ధ్యతపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాత్రి వేళలలో కూడా ప్రార్థనలు జరుగుతాయి కాబట్టి ముస్లిం సోదరుల వరకు పోలీసులు కొంత సమయం సడలింపు ఇవ్వాలని తెలియజేస్తూ ఆ అల్లా దయతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు.