పిఠాపురం : పట్టణంలోని ఏడవ వార్డు ఇందిరానగర్ లోని భారత మాజీ ఉప ప్రధాని డా.బాబూ జగజ్జీవన్ రామ్ జన్మదిన వేడుకలు జగజ్జీవన్ రామ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏడవ వార్డు కౌన్సిలర్ బోను దేవా పాల్గొని జగజ్జీవన్ రామ్ విగ్రహనికి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సంధర్భంగా బోను దేవా మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త అని, అతను బాబూజీగా ప్రసిద్ధుడన్నారు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించారు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించారన్నారు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యి, ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారు. 1946లో, అతను జవహర్‌లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టాడని, భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారన్నారు. భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా పనిచేసారని గుర్తుచేశారు. జగజ్జీవన్ సామాజిక న్యాయం రాజ్యాంగంలో పొందుపరచబడిరదని నిర్ధారించారు. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా నలభై సంవత్సరాలకు పైగా వివిధ శాఖల క్యాబినెట్ మంత్రిగా పనిచేశారని, మరీ ముఖ్యంగా అతను 1971 ఇండో-పాక్ యుద్ధం జరిగిన సమయంలో భారత రక్షణ మంత్రిగా ఉన్నాడన్నారు. ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పాటుకు సుగమం ఏర్పడిరది. భారతదేశంలో హరిత విప్లవం, భారత వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో బాబూజీ అందించిన సహకారం, కేంద్ర వ్యవసాయ మంత్రిగా తన రెండు పదవీకాలాల్లో 1974 కరువు సమయంలో, ఆహార సంక్షోభాన్ని నివారించటానికి ప్రత్యేకంగా అదనపు మంత్రిత్వ శాఖను నిర్వహించమని కోరినప్పుడు అంగీకారం తెలుపటం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయమన్నారు. భారత అత్యవసర స్థితి సమయంలో (1975-77) ప్రధాని ఇందిరాగాంధీకి మద్దతు ఇచ్చినప్పటికీ, 1977లో కాంగ్రెస్‌ని విడిచిపెట్టి, జనతా పార్టీ కూటమిలో చేరాడని, తరువాత కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పార్టీతో పాటు (1977-79) భారత ఉప ప్రధానమంత్రిగా బాబూజీ పనిచేశారని, తరువాత 1981లో ఆయన భారత జాతీయ కాంగ్రెస్(జె)ను స్థాపించాడన్నారు. అతని మరణం తరువాత స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి క్యాబినెట్‌లో చివరిగా జీవించి ఉన్న చివరి తాత్కాలిక మంత్రి, జీవించి ఉన్న చివరి సభ్యుడుగా నిలిచారన్నారు.ఈ కార్యక్రమంలో ఎం.ఎం.జె.యస్. రాష్ట్ర కోశాధికారి మరియు ఏడవ వార్డు ప్రెసిడెంట్ పలివెల గోవింద్, నాయకులు వెలుగుబంటి ప్రసాద్, చేట్ల రాంబాబు, యు.కొత్తపల్లి మాజీ యం.ఆర్.పి.యస్ నేత చంద్రరావు పాల్గొన్నారు.

previous post