Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

కాకినాడ జిల్లా మంత్రి, డిప్యూటీ సిఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించాలి.. – కలెక్టరేట్ వద్ద 8అంశాల ఫ్లెక్సీతో సామాజిక వేత్త నిరసన

కాకినాడ : జిల్లా మంత్రి, డిప్యూటీ సిఎం, జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ప్రజాహిత వెతలపై స్పందించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు 8అంశాల ఫ్లెక్సీతో గాంధేయ మార్గంగా నిరసన చేపట్టారు. కాకినాడలో 8గ్రామాల విలీన సమస్యలు, జిల్లా కేంద్రానికి కార్పోరేషన్ ఎన్నికలు, ఆర్థిక సంఘం నిధులు.. ముంపుకు గురవుతున్న కాకినాడ సామర్లకోట హైవే కెనాల్స్, ఉప్పుటేరు ప్రక్షాళన,  అనారోగ్యకర  కోనో కార్పస్ వృక్షాలు తొలగింపు, జిజిహెచ్ వికేంద్రీకరణ, ప్రసూతి విభాగంలో బెడ్స్ పెంపు,  ఉప్పాడ  తీరంలో రక్షణగోడ,  మడఅడవుల పెంపకం సంరక్షణ, సాల్ట్ భూముల్లో విమానాశ్రయం, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాదికి అన్యాయం జరగకుండా ఎంపి సీట్ల పెంపు, పర్యటనల్లో వ్యక్తిగతం కాని వినతిపత్రాల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాటు అంశాలను కోరారు. నిజాయితీగా ప్రశ్నించే ప్రజాస్వామ్య గొంతుకలకు జవాబులు ప్రకటించాలన్నారు. జిల్లాకు ఏకైక మంత్రిగా డిప్యూటీ సిఎంగా ప్రజాహిత వినతిపత్రాలు స్వయంగా స్వీకరించే ప్రక్రియకు పవన్ పర్యటనల్లో తగిన సమయం కేటాయించక పోవడం వలన అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి వలన ప్రజాస్వామిక వాదుల్లో తీవ్ర అసంతృప్తి వుందని పేర్కొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రోలుగుంట, రావికమతం నాయకులతో సమావేశం నిర్వహించిన చోడవరం నియోజకవర్గ ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు

Dr Suneelkumar Yandra

మానవత్వమే ఈశ్వరత్వము – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

TNR NEWS

అమరావతి : సీఎం చంద్రబాబు మీడియా సమావేశం* :

TNR NEWS

సుదూరప్రాంతాల నుండి ఆవిర్భవసభకు వచ్చేవారికి జ్యోతుల భోజనాల ఏర్పాటు

Dr Suneelkumar Yandra

ఉచిత కంటి వైద్య శిబిరము పోస్టర్ ఆవిష్కరణ

బ్రహ్మ కడిగిన శ్రీవారి పాదాలు