Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యార్థులు పరీక్షలను జయించడం ఎలా

అయితే, విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలంటే ప్రస్తుతం ఉన్న సమయంలో ఈ అయిదు అంశాలపైన దృష్టి పెట్టాలి. విజయానికి ఈ అయిదు మెట్లు. ఈ అయిదడుగులు దాటితే విజయం ప్రతి ఒక్కరి సొంతమవుతుంది.

 

 *పట్టుదల, లక్ష్యం అవసరం* 

 

ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొవాలి అందుకు తగ్గట్టుగానే తన ఆలోచన, తన ప్రతి ఉండాలి. చదివింది చదవాల్సింది మాత్రమే గుర్తుకు రావాలి. అర్థం కాని అంశాలను గురువులతో లేదా తన తోటి మిత్రులతో అడిగి తెలుసుకొని అర్థమయ్యేంత వరకు పట్టు వదలని విక్రమార్కుడిలా తన ముందున్న లక్ష్యంతో ముందుకు సాగాలి.

 

 *_ఆలోచనలు నియంత్రణలో ఉంచాలి_* 

 

విద్యార్థులు గతంలోని సంఘటనలను, బాధలను గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మరింత ఒత్తిడి పెరిగి చదువు నెత్తిన ఎక్కదు. అలాగే భవిష్యత్ గురించి గుర్తు చేసుకుంటే రేపు ఏమౌతదో అనే ఆలోచన ఆందోళనలను పెంచుతుంది. ఇలా గతం ఒత్తిడిని, భవిష్యత్ ఆందోళనలను మిగుల్చుతుంది. పైగా కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, కళాశాలలో జరిగిన సంఘటనలు, స్నేహం, ప్రేమ లాంటి అంశాలు అవరోధాలుగా మారి పరీక్షల సన్నద్ధతకు అడ్డుపడతాయి. కాబట్టి తమకు తాము నియంత్రించుకుని ప్రతి విద్యార్థి తమ ఆలోచనలను వర్తమానంలో ఉంచడానికి ప్రయత్నం చేయాలి. 

 

 *సమయాన్ని సద్వినియోగం చేయాలి!* 

 

ఈ సమయంలో విద్యార్థులకి అత్యంత విలువైనది సమయం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని పాఠ్యంశాలను ప్రణాళిక ప్రకారంగా తయారు చేసుకొని చదువే లక్ష్యంగా పూర్తి సమయాన్ని కేటాయించుకోవాలి. రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి గంట ముందు లేచి చదవడం ఉత్తమం.

 

 *అభ్యసనా, ఆత్మవిశ్వాసం ముఖ్య ఆయుధం* 

 

విద్యార్థుల అభ్యసన ఎంత బలంగా ఉంటే అంత ఎక్కువ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పాస్ మార్కుల కోసం అర్ధం కాని కొత్త అంశాల జోలికి వెళ్ళకుండా ఇన్ని రోజులు చదివిన ముఖ్యమైన అంశాలు విషయాలనే పరీక్షల వరకు నిరంతర అభ్యసన కొనసాగించాలి.

 

 *సెల్‌ఫోన్‌ తో దూరం ఉంటే ..* 

 

నేటి కాలంలో అవసరానికి మించి వాడుతున్న పరికరం మొబైల్ ఫోన్. ముఖ్యంగా విద్యార్థులకు సెల్‌ఫోన్ లేనిదే దినం గడవడం లేదు. ఇది సమయాన్ని వృధా చేయడమే కాకుండా, చదువుపై ఏకాగ్రత లేకుండా చేస్తుంది. మెదడుపై, కంటి చూపు పై ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం పరీక్షల వరకు పక్కన పెట్టకపోతే సంవత్సరం మొత్తం కష్టపడ్డది వృధా నే అవుతుంది.

Related posts

పాన్‌కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా..?

TNR NEWS

రాష్ట్రస్థాయిలో కోదాడ శ్రీ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

TNR NEWS

ప్రపంచ మానవాళికి ఎర్ర జెండా దిక్చూచిగా నిలిచింది.  *దేశ భవిష్యత్తును మార్చేది సోషలిజమే  *దోపిడి,పీడన, ఉన్నంతకాలం కమ్యూనిజం అజెయo  సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.   సిపిఎంరాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి…

TNR NEWS

రైతు భరోసా కు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం  టిఆర్ఎస్ ప్రభుత్వం లోని రైతులు కళ్ళలో ఆనందం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

TNR NEWS

ప్రభుత్వ పాఠశాలకు ఆర్ధిక సహాయం అందజేత* 

Vijay1192

సావిత్రిబాయి ఫూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడంపై హర్షం

TNR NEWS