పిఠాపురం : దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన పిఠాపురం పాదగయా క్షేత్రంలోని శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం వారి హుండీ లెక్కింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. సిఎఫ్‌ఓ సిహెచ్.రామ్మోహనరావు, ఇన్స్పెక్టర్ వడ్డి ఫణీంద్ర కుమార్, జోగా సత్యనారాయణ పర్యవేక్షణలో ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతూ మహాశివరాత్రి పురస్కరించుకుని 17 రోజులకుగాను రూ.11,74,660/-లు హుండీ ద్వారా ఆదాయం వచ్చిందన్నారు. గత సంవత్సర హుండీ అదాయంతో చూస్తే ఈసారి ఆదాయం బాగా పెరిగిందని ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్త బృందం, బ్యాంకు సిబ్బంది, పోలీసు సిబ్బంది, అర్చకులు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

previous post