ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింత బాబు మాదిగ తెలిపారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ఆయన కార్యాలయంలో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా మాదిగల 30 ఏళ్ల నాటి చిరకాల కోరిక అయినా ఏ బి సి వర్గీకరణను రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి దామోదర రాజనర్సింహ సూచనల మేరకు అమలు చేసినందుకు మాదిగల పక్షాన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మాదిగలు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. అదేవిధంగా మాల ఉప కులానికి చెందిన నేతగాని వెంకటేష్ మంత్రి దామోదర రాజనర్సింహ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని వెంకటేష్ తక్షణమే మంత్రికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, వర్గీకరణ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు……….
