నిత్యం సవాళ్లతో కూడుకున్న పోలీసు శాఖలో మహిళా ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమని కోదాడ పట్టణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టౌన్ బ్రాంచ్ మేనేజర్ కారిలాల్ పటేల్ అన్నారు. శుక్రవారం మహిళా దినోత్సవం సందర్భంగా కోదాడ రూరల్ సిఐ రజిత రెడ్డిని మహిళా కానిస్టేబుల్ లను పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. మహిళలు పోలీసు శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను ఆదర్శంగా తీసుకొని ధైర్యంగా ఎదగాలన్నారు. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ వంశీకృష్ణ, క్యాష్ ఆఫీసర్ నందన రెడ్డి, ముడియాల భరత్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

previous post