సిర్పూర్ నియోజకవర్గం కౌటాల మండలంలోని రుద్రాపూర్ లో మరియు చింతలమనేపల్లి మండలం బాబాపూర్ గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ప్రజా పాలన సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ గారు హాజరై లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అన్ని అందుతాయి అన్నారు. మనది ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డేవిడ్, పీడీ దత్తరాం జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస రావు మరియు మాజీ జిల్లాపరిషత్ చైర్మన్ సిడం గణపతి, మాజీ ఎంపీపీలు బసర్కర్ విశ్వనాథ్, డుబ్బుల నన్నయ్య నాయకులు ఉమ మహేష్ బింకరి నారాయణ రవీందర్ గౌడ్ మండల అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు.
