ఉచిత మెగా వైద్య శిబిరంలో వెల్లడించిన డాక్టర్ సి.హెచ్.వరలక్ష్మి
పిఠాపురం : జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ మహిళలకు పెద్ద పీట వేసారని వరలక్ష్మి హాస్పిటల్ అధినేత, జనసేన వీర మహిళ డాక్టర్ సి.హెచ్.వరలక్ష్మి అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి హాస్పిటల్ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయనకు డాక్టర్ వరలక్ష్మి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వరలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు ఉచిత వైద్యం అందించాలని ఉద్దేశంతో ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలని, వారికి కావలసిన పోషక ఆహారంపై అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది అన్నారు. ఈ వైద్య శిబిరానికి విచ్చేసిన మహిళలకు వైద్య పరీక్షలు, ఉచిత రక్త పరీక్షలు కూడా నిర్వహించారు. అనంతరం అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. తొలుత మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మీ మాట్లాడుతూ మహిళలకు ప్రాధాన్యత రాజకీయంగా కల్పించిన వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షుడు, పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, న్యాయవాది ఆర్.వి.రమణారావు, నాయకులు చెల్లుబోయిన సతీష్, మార్నిడి రంగబాబు, బి. ఎన్.రాజు, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, బొజ్జా లోవరాజు, వీర మహిళలు కోలా దుర్గ, పిల్లా రమ్యజ్యోతి, కమల, భానుమతి, కుక్కల నాగమణి, ఆకుల దుర్గ, విమల, తదితరులు పాల్గొన్నారు.