పంతాలు పట్టింపులతో కక్షిదారులు డబ్బు సమయాన్ని వృధా చేసుకోవద్దని రాజీమార్గమే రాజమార్గమని సీనియర్ సివిల్ జడ్జి సురేష్, జూనియర్ సివిల్ జడ్జీ భవ్య అన్నారు. శనివారం కోదాడ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ ను వారు ప్రారంభించి మాట్లాడారు. కక్షిదారులు ఏళ్ల తరబడి కోర్టులు చుట్టూ తిరిగి పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని న్యాయశాఖ లోక్ అదాలత్ ఏర్పాటు చేస్తుందన్నారు. పంతాలకు పోతే గెలిచేది ఒక్కరే అని రాజీ పడితే ఇద్దరు గెలుస్తారని కక్షిదారులు కేసులను ఉపసంహరించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చిత్తలూరి సత్యనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ ఆర్ కే మూర్తి, ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు, సెక్రటరీ చింతకుంట్ల రామిరెడ్డి, ధనలక్ష్మి హేమలత రమాదేవి రజని బాదేదుర్గ శిల్పా సీనియర్ న్యాయవాదులు మేకల వెంకట్రావు పాలేటి నాగేశ్వరరావు, ఈదుల కృష్ణయ్య,ఉయ్యాల నరసయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు……….