తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం గడుస్తున్నా విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి కత్తి నాగబాబు ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వ పాఠశాల విద్యపై బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో విధ్వంసం చేసిందని ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి విమర్శించి మార్పు పేరుతో అధికారంలోకి వచ్చి కార్పోరేట్, ప్రైవేట్ శక్తులను పెంచి పోషించేందుకు ప్రయత్నాలు సాగించడం సరైంది కాదన్నారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో ప్రభుత్వం సరైన దృష్టిపెట్టకపోవడంతో ఫుడ్ పాయిజన్తో పాటు ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొ న్నారు. ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని కేటాయించడంతో పాటు ప్రభుతా విద్య బలోపేతానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.