ముస్తాబాద్ రైతులను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని మండల మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నర్సింలు అన్నారు. శనివారం ముస్తాబాద్ మండలం లో బదనకల్ గ్రామంలో రైతు వేడుకలు రైతు పండుగ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో రైతు పండుగ విజయోత్సవ సంబరాలు ముస్తాబాద్ మండలం పరిసరాల గ్రామాల రైతులు భారీగా తరలి వచ్చి సీఎం ప్రసంగాన్ని విన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,.. రైతులను అభివృద్ధి పదంలో నడిపించి వారిని రాజు చేయడమే ప్రభుత్వ యొక్క ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వం కల్పించిన సకల సౌకర్యాలను రైతులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని అన్నారు. రైతులు మంచి పంటలను ఎంచుకొని అధిక ధరలకు విక్రయించి ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని ఆమె తెలిపారు. అందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని దిగ్వయంగా కొనసాగించాలని,త్వరలోనే ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తుందని అన్నారు.ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నర్సింలు, వైస్ చైర్మన్ వెలుముల రాంరెడ్డి, జిల్లా నాయకులు కొండం రాజిరెడ్డి, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ,మాజీ ఎంపిటిసి గుండెల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కలకొండ కిషన్ రావు ,తుపాకుల శ్రీనివాస్, గ్రామాధ్యక్షుడు డైరెక్టర్లు శ్రీకాంత్ ,నరసయ్య నాయకులు మహేందర్ గ్రామ ప్రజలు, రైతులు అధికారులు పాల్గొన్నారు