Tnrnews.in
తెలంగాణ

మునగాల పోలీస్ స్టేషన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

సమాజంలోని అవకాశాలను అందుకుని మహిళలు ఆదర్శవంతంగా నిలవాలని మహిళలు ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేయాలని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మునగాల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ఎస్సై సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మహిళలు విద్య, వైద్య, క్రీడా రంగాలలో రాణించడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు.సృష్టికి మూలం, అవనిలో సగం.. ఆకాశంలో సగం,అవకాశాల్లో సగం.. ఇలా ‘ఆమె’ కోసం ఎన్ని చెప్పినా,ఎంత చెప్పుకున్నా తక్కువే.ఆ రంగం.. ఈ రంగమన్న తేడా లేదు. పురుషులు చేసే ప్రతి పనినీ సమర్థంగా చేయగలిగే స్థాయికి చేరుకుంది నేటి ఆధునిక మహిళ. ‘సమానత్వమన్న’ పదానికి అర్థం చెబుతోంది. తన శక్తి అపరిమితం.. తన సహనం, తెగువ అనితర సాధ్యం. మధ్య మధ్యలో ఎక్కడో రాబందులు.. తన ఉనికికి అడొస్తున్నా, తన భవితను చిదిమేస్తున్నా..వెరవక, వెనకడుగు వేయక.. ధైర్యంగా ముందడుగు వేస్తోంది..నేటి మన ధైర్య లక్ష్మి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమంది వనితల విజయగాథలు, వివిధ రంగాల పురోగతిలోవెన్నెముఖగా నిలుస్తున్న మహిళల కు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

వర్షానికి కూలినా ఇంటి పైకప్పు

TNR NEWS

ఐఎంఏ అధ్యక్షులు గంగాసాగర్ కు సన్మానం 

TNR NEWS

తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ సిఐ

TNR NEWS

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం

Harish Hs

కోలాహలాంగా ప్రారంభమైన పోలీసు క్రీడా పోటీలు

TNR NEWS

విజ్ఞాన కేంద్రం స్థాపన కోసం భూమి కేటాయించలి  :- సీఎంకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ 

TNR NEWS