అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని కోదాడ పట్టణంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ముకుందాపురంలో గల ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో బ్రాంచ్ మేనేజర్ సంపూర్ణ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోదాడ బ్రాంచ్ పూర్తిగా మహిళా బ్యాంకు గా ఖాతాదారులకు సేవలందిస్తున్నదని మహిళా దినోత్సవం రోజున అనాధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం తనకు ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లర్కు ప్రసన్న వృద్ధాశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు……
