Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఉప్పుటేరు మూడవ వంతెనకు “సివికె రావు” నామకరణం చేయాలి

కమ్యూనిస్ట్ గాంధీకి 113వ జయంతి నివాళి

 

కాకినాడ : చిత్తజల్లు వెంకట కృష్ణారావు (సివికె రావు) 113వ జయంతి సందర్భంగా సినిమా రోడ్ సంత చెరువు పార్కువద్ద సివికెరావు విగ్రహానికి సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళావంతుల బిసి సామాజిక వర్గానికి చెందిన సివికె రావు విదేశాల్లో ఐసిఎస్ (ఐఎఎస్ ను మించిన) ఉన్నత విద్య పూర్తి చేసి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని కాకినాడ పురపాలక కౌన్సిలర్ గా, చైర్మన్ గా, ఎమ్మెల్యేగా ప్రజాహిత ప్రయోజన ఉద్యమాలు చేపట్టి రాష్ట్ర చరిత్రలో కమ్యూనిస్ట్ గాంధీగా నిస్వార్థ సేవలందించిన దేశభక్తుడని రమణరాజు పేర్కొన్నారు. చైర్మన్ గా ఎమ్మెల్యేగా ఏకకాలంలో రెండు ఉన్నత పదవులు నిర్వహించిన ఏకైక ప్రజానేతగా ఖ్యాతి చెందారన్నారు. జగన్నాధపురం ఉప్పుటేరు మీద నిర్మించే 3వ వంతెనకు సివికె రావు వారధిగా నామకరణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Related posts

రాష్ట్రవ్యాప్తంగా ఫామ్ పాండ్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Dr Suneelkumar Yandra

ఏపీలో ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదల*

TNR NEWS

ప్రభుత్వ ఉద్యోగుల భార్యలకే కుట్టు మిషన్ల పంపిణీనా..!?

Dr Suneelkumar Yandra

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుక

Dr Suneelkumar Yandra

రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలలో బండారు శ్రీనివాస్ విస్తృత ప్రచారం

Dr Suneelkumar Yandra

కుక్కుటేశ్వరుడి హుండీ ఆదాయం రూ.11,74,660/-