మహిళలపై జరుగుతున్న దాడులను ఆపడంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందికొండ గీత విమర్శించారు.
మంగళవారం రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎస్సార్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సులో ఆమె ముఖ్యవక్తంగా హాజరై ప్రసంగించారు మహిళలపై హింస, దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని నేరస్తులకు కఠిన శిక్షలు వేయడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో సహకరించడం లేదని విమర్శించారు.
మణిపూర్ లో మహిళను వివస్త్రాలను చేసి రోడ్డుపై ఊరేగించారని సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంత జరిగినా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించడం లేదని విమర్శించారు. బాలికలకు ఉచిత విద్యా, ఉచిత ఉచిత వైద్యం అందించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు.
అంగన్వాడీ, ఆశా, ఉపాధి కూలీ తదితర శ్రామిక మహిళలకు శ్రమకు తగ్గ ఫలితం అందడం లేదని విమర్శించారు.
మహిళా సాధికారత, సమానత్వం అందించాలని డిమాండ్ చేశారు పురుషుడితో సమానంగా మహిళ ఎదిగేందుకు ఈ సమాజం, ప్రభుత్వాలు సహకరించాలని కోరారు.
మహిళను తక్కువ చేసి చూసే వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.
మహిళ ఒంటరిగా తన పని తాను చేసుకుని క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకొని పరిస్థితులు ఇంకా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సదస్సుకు మహిళా సంఘం జిల్లా నాయకురాలు సమ్రీనా అధ్యక్షత వహించగా మహిళా సంఘం నేతలు గుండెగారి రాజేశ్వరి, బాలమణి, అమృతమ్మ ప్రజా సంఘాల నాయకులు వెంకట్రామిరెడ్డి, గోపాల్, బాల్ రాం, అంజిలయ్య గౌడ్, చంద్ర శేఖర్, మొహ్మద్ అలీ హజారే మాట్లాడారు.
ఈ సదస్సులో మహిళా సంఘం నాయకులు దానమ్మ, లలితమ్మ కృష్ణవేణి, కవిత, ఆశమ్మ తదితరులు పాల్గొన్నారు.
సదస్సు తర్వాత ఎస్ఆర్ గార్డెన్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా పాత బస్టాండ్ లో నిరసన వ్యక్తం చేశారు.