పిఠాపురం : ఈనెల 10వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో ఆర్చరీలో హైయెస్ట్ స్కోరింగ్ కొట్టిన ఆధారంగా ఈనెల 15వ తారీకు రాత్రి ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్లో ఎంపికైన ఆర్చర్స్ లిస్టును రిలీజ్ చేశారు. అందులో పిఠాపురం నుండి ముమ్మిడి నిత్యశ్రీ ఎంపికయింది. ఎంపికైన పిఠాపురం అర్చర్ ఈనెల 22 నుంచి 29 వరకు గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న 6వ జాతీయస్థాయి అండర్ 10 ఇండియన్ రౌండ్ బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ తరపున జాతీయస్థాయిలో ముమ్మిడి నిత్యశ్రీ పాల్గొంటుందన్నారు. అండర్ 10 ఇండియన్ రౌండ్ బాలికల విభాగంలో పిఠాపురం నుండి మొట్టమొదటిసారిగా అతి చిన్న వయసులో ఎంపికైనట్లు కోచ్ పి.లక్ష్మణరావు తెలిపారు. నిత్యశ్రీ వయసు 6 సంవత్సరాలని, తను ఆర్చరీలో ఎన్నో పథకాలు సాధించాలని కోరారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ బి.శ్రీనివాస్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు కె.పద్మనాభం నిత్యశ్రీని అభినందించారు.