Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

పిఠాపురంలో చేయూత నిత్యాన్నదానం ప్రారంభం

పిఠాపురం : ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేవా స్పూర్తితో పిఠాపురం  పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్య అన్నదానం కార్యక్రమం మొదలు పెట్టడం చాలా సంతోషం అని కౌడా చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి  అన్నారు. బుధవారం పిఠాపురం పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గర్భిణీ స్త్రీలకు, రోగి సహాయకులకు నిత్య అన్నదానం కార్యక్రమాన్ని ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చాలని ఎంతో మందికి అన్నం పెట్టిన ఆంధ్ర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ స్పూర్తితో ఇలాంటి కార్యక్రమాన్ని పిఠాపురంలో మొదలుపెట్టి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన చేయూత సంస్థ ఫౌండర్ మొండి రవికుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీపేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ  ఎమ్మెల్సీగా నా తొలి కార్యక్రమం, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందం ఉంది అని, చేయూత సంస్ధ చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్ని ఏంతో మందికి సహాయం అందిస్తున్నాయి అని, సంస్ధకి ఏ విధమైన సహాయ, సహకారాలు కావాల్సిన ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా అని తెలిపారు. ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ పి.సుజాత మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాన్ని మా ఆసుపత్రిలో ఏర్పాటు చేసి ఎంతోమందికి సహాయం చేస్తున్నారని తెలియచేసారు. సహకరించిన జిల్లా వైద్య అధికారిణికి, జిల్లా కలెక్టర్ కి ధన్యవాదములు తెలియచేశారు. వారితో పాటు డాక్టర్ల బృందం, ఆసుపత్రి కమిటీ మెంబర్లు బొజ్జా కుమార్, వేణుం సురేష్, పిఠాపురం పట్టణ జనసేన, టీడిపి నాయకులు అభిమానులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, చేయూత స్వచ్ఛంద సంస్థ సెక్రటరీ అలీమ్, సభ్యులు చింతా పవన్ కళ్యాణ్, ఆస్పత్రి సిబ్బంది, సిబిఆర్ విద్యార్థులు , తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, నాయకులకు పుర ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు పిఠాపురం చేయుత టీం సభ్యులు నీలం దయా సాగర్, సుంకర అనిల్, కట్టా నాగేశ్వర రావు, సియాదుల శ్రీమన్ నారాయణ (కార్యక్రమ వ్యాఖ్యాత), కాకి రాంబాబు ధన్యవాదములు తెలియచేశారు. ఈ చేయూత నిత్యాన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇచ్చే దాతలు 8639727476 కి సంప్రదించవచ్చు అని తెలియచేశారు.

Related posts

తిరుమల శ్రీవారి సమాచారం…

TNR NEWS

మార్చి 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు

Dr Suneelkumar Yandra

మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి కానుక*

TNR NEWS

నాపై కేసులన్నీ ఆరోపణలే – మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Dr Suneelkumar Yandra

బ్రహ్మ కడిగిన శ్రీవారి పాదాలు

కాకినాడ కార్పోరేషన్ త్రాగునీటి సరఫరాకు చేరుతున్న గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయి

Dr Suneelkumar Yandra