Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

నిరక్షరాస్యత నిర్మూలన పై ప్రత్యేక శ్రద్ధ

తల్లిదండ్రుల పేదరికం పిల్లల పాలిట శాపంగా మారుతొంది.  మనకు స్వాతంత్రం సిద్ధించి 75సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇంకా మన దేశంలో  దారిద్య్ర  రేఖకు దిగువగా 68. శాతం ప్రజలు జీవిస్తున్నారని 2021 నాటి  గ్లోబల్ ఎంపిఐ  సర్వే  తెలియజేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, ఏడు సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మరియు చదవడానికి మరియు వ్రాయడానికి సామర్థ్యం ఉన్న ఏ వ్యక్తినైనా అక్షరాస్యులుగా పరిగణిస్తారు. భారతదేశంలో సగటు అక్షరాస్యత రేటు 74.04%. కేరళలో 93.91% అక్షరాస్యత రేటు అత్యధికంగా ఉండగా, బీహార్‌లో 63.82% అక్షరాస్యత రేటు తక్కువగా ఉంది. నిరక్షరాస్యత నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు నీళ్లలా ఖర్చుచేస్తున్నా సంపూర్ణ ఆక్షరాస్యత సాధించలేకపోతున్నారు. వయోజన విద్య, అక్షరసంక్రాంతి, అక్షరభారతి, సాక్షరభారత్‌ పేర్లతో ఎన్ని కార్యక్ర మాలు తీసుకున్నా నేటికి ఏఒక్క గ్రామంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించలేకపోవడం దురదృష్టకరం.

 

భారతదేశం యుగయుగాలుగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో పేదరికం ఒకటి. భారతదేశంలో విస్తృతమైన నిరక్షరాస్యతకు పేదరికం ఒక మూల కారణం అవుతోంది. రోజువారీ రొట్టె కోసం ఇబ్బంది పడుతున్న కుటుంబాలు తమ పిల్లలకు విద్యను అందించలేకపోతున్నాయి. పొట్టకూటి కోసం వీధులలో అడుక్కుంటున్న అలాగే సంచారం చేస్తూ వివిధ  గ్రామాలకు వెళ్లి పనులు చేసుకొని జీవిస్తున్న కుటుంబాలకు ఆధార్ కార్డులు పొందే వీలు లేకపోవడంతో  వారి పిల్లలకు ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశం లభించడం లేదు . తిండికి  గడవడమే కష్టంగా వున్న వారికి ఇక ప్రైవేటు చదువులు అందని ద్రాక్ష అవుతొంది.

 

ఇటువంటి కుటుంబాలలో వారి పిల్లలను కూడా చిన్నప్పుడు బిచ్చగాళ్ళుగా , కాస్త పెద్దయ్యాక కూలీలుగా తయారు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బడిబాట పేరిట ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలను చేర్పించే పధకం చేపట్టినా  గతంలో స్కూళ్లలో చదివి కుటుంబ ఆర్ధిక పరిస్థితి కారణంగా  చదువులు మానేసిన వారిపైనే దృష్టి సారిస్తున్నారు తప్ప ఇటువంటి సంచార జాతుల వారు, వలస కూలీల పిల్లలపై దృష్టి సారించడం లేదు. అందరికి విద్య అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యా హక్కు చట్టం యొక్క లక్ష్యం నీరు కారిపోతుంది.

ఇటువంటి సంచార జాతుల సంక్షేమం పై దృష్టి సారించడంతో  పాటు  వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను చేపట్టాలి.  గ్రామ స్థాయిలో వీరికి నివాసం ఏర్పాటు చేయడంతో పాటు  ఆర్ధిక స్వావలంబన కోసం ఉపాధి కల్పించాలి . వీరికి ఆధార్ కార్డులు అందించడంతో పాటు  ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశం కల్పించాలి. ప్రభుత్వ పథకాలన్నింటినీ వీరికి కూడా వర్తింపజేయాలి. .గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలకు పాఠశాలలు అందుబాటులో లేకపోవడంతో భారతదేశంలో నిరక్షరాస్యత పెరుగుతోంది. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు రవాణా మాధ్యమం వంటి వివిధ సమస్యలు లేవు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు పాఠశాలకు చేరుకోవడానికి మైళ్ల దూరం నడవాల్సి వస్తుంది. ఈ పాఠశాలల్లో చాలా వరకు నిధులు, అర్హత కలిగిన సిబ్బంది, సరైన సీటింగ్ ఏర్పాట్లు, పారిశుద్ధ్య సౌకర్యాలు, ఆరోగ్యకరమైన ఆహారం మరియు విద్యకు అనుకూలమైన వాతావరణం లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.కుల వివక్ష, బాల్యవివాహాలు, బాల కార్మికులు వంటి ప్రధాన సామాజిక సమస్యల కారణంగా చాలా మంది పిల్లలు ప్రాథమిక ప్రాథమిక విద్యను కూడా కోల్పోతున్నారు. భారతదేశంలో విద్య విషయంలో ఆడవారిపై ఉన్న లింగ వివక్షత కారణంగా నిరక్షరాస్యత తీవ్రమవుతోంది.

తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలను బడిలో చేర్పించాలి, బాలకార్మికులుగా మారకుండా చూడాలి. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం మాదిరిగా ప్రతి ఒక్కరు వయోజనులతో కలిసి చదువుకోవాలన్న చట్టం తేవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్షరాస్యత సాధ నలో చిత్తశుద్ధిగా వ్యవహరించాలి. నిర క్షరాస్యత నిర్మూలన కార్యక్రమాలు పక డ్బందీగా అమలు చేసి ఫలితాలు రాబట్టాలి. కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలను  ఆదర్శంగా తీసుకోవాలి. పాఠశాలల్లో మౌలిక సదు పాయాలు కల్పించాలి. మహిళల అక్షరాస్యత పెంపునకు ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోవాలి. వారికోసం ప్రత్యేక బడులు, కళాశాలలు ఏర్పాటు చేయాలి. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకనుగుణంగా ఉపాధ్యాయులను నియ మించాలి. నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఖచ్చితంగా అమలుచేయాలి. 5-14 ఏళ్ల బాలబాలికలంతా బడిలో ఉండేలా చూడాలి. బాల్యవివాహాలు చేసిన వారిపై చట్టాలను కఠినంగా అమలు చేయాలి.ప్రభుత్వం మరియు వివిధ సంస్థలు పాఠశాలల్లో ఉచిత పుస్తకాలను అందించి, విద్యార్థులు పఠన సంస్కృతిని పెంపొందించేలా ప్రోత్సహించవచ్చు. ఉచిత పుస్తకాలను అందించడం వల్ల పాఠ్యపుస్తకాల సరఫరాలో తల్లిదండ్రులపై పడే ఆర్థిక భారాన్ని కూడా తగ్గించవచ్చు.

 

సి.హెచ్.ప్రతాప్

రచయిత

Related posts

కాకినాడ కార్పోరేషన్ ‘ట్రేడ్’ రాబడిపై నిఘా నిర్వహించాలి – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

Reporter James Chinna

ఎస్ఐ శ్రీ మహేష్ బాబు మరియు HC శ్రీ మొగిలీశ్వర్ రెడ్డి లు సస్పెండ్.*

TNR NEWS

సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారు అంటూ షర్మిల ధ్వజమెత్తారు

TNR NEWS

బహుజనుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి కాన్షీరాం

Dr Suneelkumar Yandra

సుదూరప్రాంతాల నుండి ఆవిర్భవసభకు వచ్చేవారికి జ్యోతుల భోజనాల ఏర్పాటు

Dr Suneelkumar Yandra

గత ప్రభుత్వంలో ఇళ్ళులేని పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి స్థలం చూపించలేదు

Reporter James Chinna